చీమకుర్తి మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి కు గౌరవ డాక్టరేట్ లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ ఆఫ్ యూనివర్సిటీలో అతను చేసిన సేవలకు మెచ్చి గౌరవ డాక్టరేట్ ను శుక్రవారం ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వెంకారెడ్డి మాట్లాడుతూ తాను చేసిన సోషల్ సర్వీస్ ప్రజా సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ యూనివర్సిటీ వారు ప్రధానం చేశారని తెలిపారు. గౌరవ డాక్టరేట్ సాధించిన వెంకారెడ్డిని పలువురు అభినందించారు.