నాగులోప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో సంతనూతలపాడు టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సూపర్ సిక్స్ పథకాలను మండల టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి విజయ్ కుమార్ ని, పార్లమెంట్ అభ్యర్థి మాగుంటను గెలిపించాలని కోరారు.