చెరువు కట్ట తెగిపోవటంతో హైవే రహదారిపైకి వరద నీరు పోటెత్తింది. నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామ సమీపంలోని రామన్న చెరువు కట్ట భారీ వర్షాలకు బుధవారం తెగిపోయింది. దీంతో ఆ నీరంతా త్రోవగుంట-దిగమర్రు 216వ జాతీయ రహదారిపై నుంచి దిగువకు ప్రవహిస్తూనే ఉంది. బుధవారం మొదలైన వరద ఉధృతి గురువారానికి కూడా తగ్గలేదు. దీంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో హైవే పై పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి దారి మళ్ళించారు.