కనపర్తిలో శుక్రవారం విచిత్ర ఘటన జరిగింది. ఇరవై రోజుల క్రితం రెడ్డిపాలేనికి చెందిన వృద్ధురాలు కుక్కల కోటేశ్వరమ్మ(70) ప్రయాణిస్తున్న ఆటో దాసరివారిపాలెం వద్ద బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం జీజీహెచ్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ అభ్యర్థనపై శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు.