నాగులుప్పపాడు: మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్

4చూసినవారు
నాగులుప్పపాడు: మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్
బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారికి నాగులుప్పపాడు ఎస్సై రజియా సుల్తానా శుక్రవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. రాత్రి మండల కేంద్రానికి అతి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో నలుగురు వ్యక్తులు మద్యం తాగుతున్నారన్న విషయాన్ని గుర్తించి వారిని మందలించారు. జరిమానా విధించడంతో పాటు కౌన్సిలింగ్, వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రజియా సుల్తానా ప్రజలను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్