మహిళలు ఉత్పత్తి రంగాల్లో రాణించాలని మెప్మా పీడి రవికుమార్ తెలిపారు. ఒంగోలులోని డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాల కోసం ఏర్పాటుచేసిన అర్బన్ మార్కెట్ ను రవికుమార్, యూనియన్ బ్యాంక్ రీజినల్ డిప్యూటీ హెడ్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్ సాంబశివరావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘ మహిళలకు బ్యాంకులు, రుణపతి కోసం ఎన్నో మెరుగైన పథకాలను అమలు పరుస్తున్నాయని తెలిపారు.