మట్టి వినాయకులను మాత్రమే వాడాలి: సీఐ

83చూసినవారు
మట్టి వినాయకులను మాత్రమే వాడాలి: సీఐ
చీమకుర్తి సర్కిల్ పరిధిలోని ప్రజలు మట్టి గణపతులతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని చీమకుర్తి సీఐ సుబ్బారావు సూచించారు. గురువారం స్థానిక సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాలను వినియోగించవద్దని సూచించారు. వాటివల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, పర్యావరణహితం కోసం మట్టి గణపతులనే పూజించాలని సీఐ కోరారు.

సంబంధిత పోస్ట్