చీమకుర్తిలో బస్టాండ్ సెంటర్లో రహదారిని ఆక్రమించిన దుకాణాలను తొలగించారు. మున్సిపాలిటీ సిబ్బంది మంగళవారం సాయంత్రం ఈ తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫుట్ పాత్ పై రహదారులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రామకృష్ణ హెచ్చరించారు. అనుమతులు లేకుండా రహదారికి ఇరువైపులా ఫ్లెక్సీ బోర్డులు, ఇతర బోర్డులు పెట్టకూడదన్నారు.