నాగులుప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అన్సారియా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని, వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు. రోగులకు అందుతున్న వైద్యసేవల తీరును, రికార్డులను, క్యాజువల్ రూములను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.