మద్దిపాడు మండల కేంద్రంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశుధ్య పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని సైడ్ కాలువలో పూడిక తీయించారు. గ్రామంలోని రోడ్లుకు ఇరు వైపుల గల పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం బ్లీచింగ్ చల్లించినట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. గ్రామంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.