ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పట్టణంలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. 11 కెవి విద్యుత్ వైర్లు కలిగి ఉన్న ఓ స్తంభం పైకి పిచ్చి మొక్కలు ఏర్లు వ్యాప్తి చెందాయి. పిచ్చి మొక్కలు పచ్చిగా ఉండడం వల్ల విద్యుత్ సరఫరా అవుతుందని స్థానిక ప్రజలు ఆదివారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి స్తంభంపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.