సంతనూతలపాడు: పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

76చూసినవారు
సంతనూతలపాడు:  పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలోని పొగాకు బోర్డు కేంద్రంలో జరిగిన వేలం కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ కేశంగ్ యాంగ్జామ్ షేర్ప, ఎమ్మెల్యేతో కలిసి పొగాకు నాణ్యతపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బోర్డు ED విశ్వ, అధికారులు, బయ్యర్లు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్