సంతనూతలపాడు మండలం పేర్నిమిట్ట పొగాకు వేలం కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో పాటు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చైన్ సెక్రటరీ కేశంగ్ యాంగ్జామ్ శనివారం పరిశీలించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశమని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. అనంతరం స్థానిక పొగాకు రైతులతో ఇరువురు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.