సంతనూతలపాడు మండలంలోని లక్ష్మీపురం ఉపాధి హామీ కూలీలను జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదన్నారు. జీతం లేక కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందన్నారు. అధికారులతో సంప్రదించి జీతాలు వెంటనే ఇప్పించే ఏర్పాటు చేస్తానని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు.