ఎస్ఎన్ పాడు: 20 మద్యం సీసాలు స్వాధీనం

84చూసినవారు
ఎస్ఎన్ పాడు: 20 మద్యం సీసాలు స్వాధీనం
బెల్ట్ షాపులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లుగా నాగులుప్పలపాడు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామంలో గురువారం పోలీసులు బెల్ట్ షాపు పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా తెలిపారు. ఎవరైనా బెల్ట్ షాపు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్