రహదారి ప్రమాదంలో లారీ డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మద్దిపాడు మండలంలోని గుండ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకున్నది. నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామానికి చెందిన వినయ్ కుమార్ లారీతో గుంటూరు వైపు నుండి చెన్నై వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొనడంతో వినయ్ కుమార్ గాయాలతో మృతి చెందాడు. మద్దిపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.