సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా మంగళవారం నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ ఏఈ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని కుంచాల వారి పాలెం, మైనంపాడు, ఎండ్లూరు గ్రామాలలో ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వస్తున్నామని పి. గుడిపాడు, కొనగానివారి పాలెం, చంద్రపాలెం గ్రామాలలో ఉదయం ఏడు గంటల నుండి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వస్తున్నట్లుగా తెలిపారు.