మద్దిపాడు మండలం సీతారామపురంలో బుధవారం నుండి రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు భాను ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండవ బహుమతిగా రూ. 75,000 మూడవ బహుమతిగా రూ. 50,000 నాలుగవ బహుమతి రూ. 25,000 అందిస్తామని తెలిపారు. ఎంట్రీ ఫీజు రూ. 10,000 చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.