సంతనూతలపాడు మండలంలో జరుగుతున్న హౌస్ హోల్డ్ సర్వేను త్వరగా పూర్తిచేయాలని బుధవారం ఎంపీడీవో సురేష్ బాబు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో జరుగుతున్న సర్వేను అధికారులతో కలిసి పల్లె గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కుటుంబ సభ్యుల వివరాలు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.