ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు దక్షిణాది ప్రాంతీయ ఇన్చార్జ్ రీజినల్ మేనేజర్ గా బి. సుబ్బారావు నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఆర్ఎం గా ఉన్న లక్ష్మనరావు కృష్ణ శ్రీ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ప్రస్తుతం గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్న సుబ్బారావుకు ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు.