సంతనూతలపాడు మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న శివాలయంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధాన అర్చకులు వెంకటేశ్వర శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన, వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తామని. చెప్పారు. భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.