Mar 21, 2025, 04:03 IST/
మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
Mar 21, 2025, 04:03 IST
TG: మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజి సమీపంలో మహిళా కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురి పరిస్థితి విషమం ఉందని, మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. చర్లపాలెం గ్రామానికి చెందిన మహిళలు మిర్చి తోట ఏరడం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.