దోర్నాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో జూనియర్ విద్యార్థులు 81% ఉత్తీర్ణత శాతం సాధించారు. 85% పాస్ శాతం సీనియర్ విద్యార్థులు నమోదు చేసి, తమ ప్రతిభను చాటారని ప్రిన్సిపాల్ మహాలక్ష్మమ్మ అన్నారు. ఎమ్.పి.సిలో 39/34. బైపీసీలో 27/25 మంది, సీఈసీ 19/15, హెచ్ఈసీలో 15/12 మంది విద్యార్థులు పాసైనట్లు వివరించారు. ఫలితాల వెనక అధ్యాపకులు కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం ఉందన్నారు.