ప్రకాశం జిల్లా దోర్నాల పరిసర ప్రాంతాల్లో ఓ చిన్న విమానం చక్కర్లు కొడుతూ దర్శనమిచ్చింది. గురువారం మధ్యాహ్నం నల్లమల అటవీ ప్రాంతం మీదుగా వెళ్తూ మళ్లీ వెంటనే తిరిగి మరో వైపునకు వెళ్తుంది. పదే పదే ఈ చిన్న విమానం ఈ ప్రాంతంలో చక్కర్లు కొడుతుండడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. మరి కొందరు జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా ఏరియల్ సర్వే జరుగుతూ ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.