హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎర్రగొండపాలెం లోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు నాయకులతో కలసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేక్ ఒకరినొకరు తినిపించుకున్నారు. మహేష్ నాయుడు, బాస్కర్, నాయకులు పాల్గొన్నారు.