దోర్నాల మండలం కొత్తూరు నల్లమల అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 400 లీటర్ల బెల్లం ఊటను బుధవారం ఎక్సైజ్ అధికారులు ద్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు మాట్లాడుతూ. నిర్మానుష్య ప్రదేశమైన అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన చెక్క, బెల్లం తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నాటు సారా తయారు చేయడం నేరమని ఎక్సైజ్ ఎస్ఐ వెంకట రెడ్డి హెచ్చరించారు.