దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలో శనివారం పాత గొడవల నేపథ్యంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ప్రత్యర్ధులు గొడ్డలితో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన డిఎస్పి నాగరాజు ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గత ఎలక్షన్ల నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య శత్రుత్వం ఏర్పడిందని అన్నారు. అప్పట్లో మృతుడు సర్పంచ్ భర్తను హత్య చేశాడని అప్పటినుంచి ప్రత్యర్థులు ఇతనిపై పగ పెంచుకున్నట్లు డిఎస్పి అన్నారు.