దోర్నాల: సుందరయ్య కాలనీలో అగ్ని ప్రమాదం

84చూసినవారు
దోర్నాల: సుందరయ్య కాలనీలో అగ్ని ప్రమాదం
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని సుందరయ్య కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గుడిసె పూర్తిగా దగ్ధమై సుమారు రూ. 50,000 ఆస్తినష్టం సంభవించిందని శనివారం తెలిపారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్