దోర్నాల మండలం వై. చెర్లోపల్లి అటవీ ప్రాంతంలో నాటుసార స్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానిక స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ గోపాలకృష్ణతో పాటు ఎస్సై మహేష్ తో కలిసి నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్న 1, 000 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. నాటు సారాకు ఉపయోగించే డ్రమ్ములను డిస్ట్రాయిడ్ చేశారు. నాటసార తయారు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై మహేష్ హెచ్చరించారు.