ఎర్రగొండపాలెం మండలంలోని ఆమనగుడిపాడు, గుర్రపుశాల గ్రామాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.