యర్రగొండపాలెం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను సీపీఐ నాయకులు నిర్వహించారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయనను పలువురు కొనియాడారు. మహిళల ప్రాధాన్యత గురించి చాటి చెప్పి అట్టడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడిన ఘనత జ్యోతిరావు పూలే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.