పెద్దదోర్నాల మండల పరిధిలో శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 3150 సర్వీసులను పరిశీలించిన అధికారులు అధికలోడు, మాల్ ప్రాక్టీస్, విద్యుత్ చోరీకి పాల్పడుతున్న 65 మందిపై కేసులు నమోదు చేసి రూ. 1. 48 లక్షల నగదు జరిమానా విధించినట్లు మార్కాపురం విద్యుత్ ఈ. ఈ పివి నాగేశ్వరరావు, ఒంగోలు డి. పి. ఈ ఈ. ఈ హైమావతి తెలిపారు. దాడుల్లో గిద్దలూరు, యర్రగొండపాలెం, కంభం ఏ. ఈ లు పాల్గొన్నారు.