పెద్ద దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం నాటుసార స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారు చేసేందుకు ఉపయోగించే 800 లీటర్ల బెల్లం ఊట ను గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఎక్కడైనా నాటు సారా తయారు చేసేందుకు ప్రయత్నిస్తుంటే 100 ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు.