పెద్దారవీడు మండలం తంగిరాల పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి నూతన రైతు సేవా కేంద్రాన్ని టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఒంగోలు టిడిపి పార్లమెంట్ పరిశీలకులు నూకసాని బాలాజీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మూడు విడతల్లో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు పెట్టుబడి సహాయం అందిస్తామని నూకసాని బాలాజీ అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.