ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని కలనూతల అడవి ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నా బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు పెద్దారవీడు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ. మండలంలో ఎవరైనా నాటు సారా తయారు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.