పెద్దారవీడు: దొంగలు హల్ చల్

76చూసినవారు
పెద్దారవీడు: దొంగలు హల్ చల్
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దకట్లలో దొంగలు రెచ్చిపోయారు. గ్రామ సమీపంలోని ఓ పొలంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను దొంగలు పగలగొట్టి అందులోని రాగి వైరును దొంగిలించి తీసుకువెళ్లారు. దీనివల్ల రూ. 70 వేలు ఆర్థిక నష్టం జరిగిందని మహిళ రైతు పోతిరెడ్డి చిన్నక్క వెల్లడించింది. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పడంతో శుక్రవారం అధికారులు లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్