టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబుపై ఫిర్యాదు చేసేందుకు శనివారం త్రిపురాంతకం నుంచి టిడిపి అసమ్మతి వర్గం అమరావతి వెళ్లడంతో రాజకీయం రాజుకుంది. ఈ నేపథ్యంలో వారిపై ఎండూరివారిపాలెం టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. వైసీపీవారిని వెంటేసుకుని వెళ్లి ఎరిక్షన్ బాబును నిందించడం సరికాదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇన్ఛార్జ్ అహర్నిశలు కృషి చేస్తుంటే కొందరు కావాలనే ఆయనపై నిందలు మోపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.