పుల్లలచెరువు మండలం నరజాముల తండా, పెద్ద పిఆర్సి తాండ అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం ఊటను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. అనంతరం నాటు సారా తయారీకి ఉపయోగించే వస్తువులను అధికారులు దగ్ధం చేశారు. నాటు సారా తయారు చేయటం అమ్మటం చట్టారీత్యా నేరమని సీఐ బాల నరసింహారావు తీవ్రంగా హెచ్చరించారు.