పుల్లలచెరువు మండలం వెల్లటూరు సాగర్ కాలువ వద్ద బుధవారం వేగంగా వెళుతున్న ఇటుకల ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడ్డ సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని ముట్టుకుల గ్రామం నుంచి వినుకొండకు ఇటుకలు తీసుకువెళ్తున్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడగా తెల్లగట్ల గ్రామానికి చెందిన అనంతరాములు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్సై వెల్లడించారు.