పుల్లలచెరువులో ఈ నెల 13 - 15 వరకు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పిఎల్ఎన్సీ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ శుక్రవారం తెలిపారు. మహిళలకు రంగవల్లుల పోటీలు, స్లో బైక్ రేసింగ్, ట్రాక్టర్ రివర్స్, షటిల్ డబుల్స్ బ్యాడ్మింటన్ పోటీలు, గోమాతలకు ప్రత్యేక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు పోటీల్లో పాల్గొని సంక్రాంతి సంబరాలను జయప్రదం చేయాలని విజేతలకు విలువైన బహుమతులు అందజేస్తామన్నారు.