పుల్లలచెరువు మండలం మానేపల్లి గ్రామంలో ఎస్సీ పాలెం నికి చెందిన కొండ అశోక్ మీద దాడి జరిగి వారం రోజులైనా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధ్యుతుడి తల్లిదండ్రులు ఎస్పీ దగ్గర మొరపెట్టుకున్నారు. మంగళవారం సాధారణ తనిఖీల్లో భాగంగా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన ఎస్పీ ని మానేపల్లి పాలెం వాసులు కలిసి తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ దామోదర్ అన్నారు.