పుల్లలచెరువు: ఎంపీ నిధులతో వాటర్ ప్లాంట్స్

69చూసినవారు
పుల్లలచెరువు: ఎంపీ నిధులతో వాటర్ ప్లాంట్స్
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఎంపీ నిధుల నుండి నీటి సమస్య కోసం రూ. 9 లక్షలు ఎంపీ కేటాయించారు. మండలంలో 9 చోట్ల ఆర్వో వాటర్ ప్లాంట్ లు నిర్మిస్తున్నట్లు గురువారం ఎంపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల అయింది. దీంతో మండలంలో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్