పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట వద్ద 40 కేజీల గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకొని తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఓ చర్చి వెనుకాల కాలి ప్రదేశంలో ఆరుగురు వ్యక్తులు గంజాయి వివిధ ప్రాంతాలలో అమ్ముకోవడానికి పంచుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం నిందితులను విచారించి రిమాండ్ కు తరలించామని బుధవారం పోలీసులు తెలిపారు.