
9న చిత్తూరుకు జగన్.. 10 వేల మందికి అనుమతివ్వండి!
AP: ఈ నెల 9న వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించనున్నారు. ఈ పర్యటనకు ఏకంగా 10 వేల మంది వస్తారని, ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ పార్టీ నేతలు పోలీసులను కోరారు. అయితే సంఖ్యను తగ్గించుకుని ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు చెప్పినట్లు సమాచారం. కాగా, ఇటీవల జగన్ రెంటపాళ్ల పర్యటనలో 113 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.