ప్రకాశం జిల్లా, సింగరాయకొండ ఆర్ఎస్ పాఠశాలలో శనివారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో జయమని హాజరయ్యారు. మానసిక వికలాంగులకు ఈ పాఠశాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీవో అన్నారు. ఫిజియోథెరపీతో పాటు వారి దినచర్యపై ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ ఇస్తారని ఆమె తెలిపారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అంగవైకల్యం జయించవచ్చని ఎంపీడీవో అన్నారు.