ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం వెలువరించిన తీర్పు హర్షణీయమని టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. గురువారం దోర్నాలలోని నటరాజ్ కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంద కృష్ణమాదిగల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నాయకులు పాల్గొన్నారు.