వస్త్రదుకాణంలోకి చొరబడిన అయిదుగురు ఆ దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డ సంఘటన త్రిపురాంతకం మండలం మేడపిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందినవారు ఆటోలో మేడపికి చేరుకున్నారు. 18 వేల విలువైన వస్త్రాలను చోరీ చేసినట్లు యజమాని సుబ్బారావు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఆటో దొంగలించబడ్డ వస్త్రాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.