ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని కర్నూలు విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు గడ్డిలోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్టర్ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.