శ్రీశ్రీ 42వ వర్థంతిని సందర్భంగా త్రిపురాంతకం మండలంలో ఆదివారం శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య నేతృత్వంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ యువతకు శ్రీశ్రీ ఆదర్శమై, మార్గదర్శిగా నిలిచారన్నారు. విద్యార్థులు పాల్గొన్న ఈ సభలో శ్రీశ్రీకు ఘనంగా అంజలి సమర్పించారు.