ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని స్థానిక శాఖ గ్రంథాలయంలో శనివారం గురజాడ అప్పారావు 109వ వర్ధంతి పురస్కరించుకుని, ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రంధపాలకుడు జి. రామాంజి నాయక్, సాహితీవేత్త గొట్టిముక్కుల నరసయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.